E.G: బిక్కవోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం “మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదిక” కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. ఉపాధి హామీ పథకం అమలులో ఎటువంటి అక్రమాలు జరిగిన సహించేది లేదని హెచ్చరించారు.
ELR: రైతులు సామూహికంగా ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టి అధిక దిగుబడి పొందాలని ఉంగుటూరు మండల ఎంపీటీసీ ఛాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు అన్నారు. శనివారం నారాయణపురంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎలుకల నిర్మూలన మందు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అలకనంద శ్రీనివాస్, వ్యవసాయ శాఖ సిబ్బంది మౌనిక సోనీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
W.G: ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఏలూరుపాడు అంబేడ్కర్ ఫ్లెక్సీ వివాదంపై స్పందించారు. శనివారం ఆయన మాట్లాడారు. “ఏలూరుపాడు మా అమ్మమ్మగారి ఊరు. అటుగా వెళుతున్న సమయంలో అక్కడ ఉండే నాగేంద్ర స్వామి గుడిని మూసేసి అంబేడ్కర్ ఫ్లెక్సీ కట్టారు. గుడిపై ఇద్దరు కూర్చొని ధూమపానం చేశారు. అది చూసి ఫ్లెక్సీని తొలగించానన్నారు.
NLR: కావలి రూరల్ మండలంలోని నడింపల్లి గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కూటమి నేతలు నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ.. ఈ వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత జనార్ధన్, నేతలు తదితరులు పాల్గొన్నారు.
WG: ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ శనివారం పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుంటున్న విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను హెడ్‌మాస్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో విడివిడిగా ముచ్చటించారు.
KRNL: కర్నూలులోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ పి.రంజిత్ బాషా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కర్నూలు MP బస్తిపాటి నాగరాజు, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఆర్ఓ చిరంజీవి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
కోనసీమ: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజలందరి బాధ్యత అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శనివారం ఉదయం రామచంద్రపురం విఎస్ఎం కాలేజీ నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలు కళాశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
VSP: విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పాంగి జీవన్ కృష్ణ పేర్కొన్నారు. శనివారం పాడేరులో ఎస్ఎఫ్ఐ నేతలు సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా ఎస్ఎఫ్ఐ పాడేరు మండల కమిటీని ఎన్నుకున్నారు. ఎస్ఎఫ్ఐ పాడేరు మండల అధ్యక్షుడుగా పీ.ఆనంద్, సెక్రటరీగా సింహాద్రి, వైస్ ప్రెసిడెంట్‌గా సాయికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
SKLM: భారతీయ విద్యా కేంద్రం ఆర్ష విజ్ఞాన భారతి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యా యలు చిన్న కర్రీవాణిపాలెం, బట్టివాణిపాలెంలో శనివారం రోజున సముద్ర జలాల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్లాస్టిక్ వల్ల స్థానికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కవిటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
KDP: మైదుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టణ సబ్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చేయి, చేయి కలిపి మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
KDP: కంపోస్ట్ యూనిట్‌తో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని యోగివేమన విశ్వవిద్యాలయ (YVU) ఉపకులపతి ఆచార్య కె.కృష్ణారెడ్డి అన్నారు. శనివారం YVU బాలికల హాస్టల్ ప్రాంగణంలో కంపోస్టు యూనిట్‌ను వీసి కృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ ఎస్.రఘునాథ రెడ్డి, కడప మున్సిపల్ కార్పొరేషన్ పర్యావరణ ఇంజినీర్ రవీంద్రనాథ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.
అన్నమయ్య: సంబేపల్లి మండలం బావులకాడపల్లి వద్ద బొలెరో, ఇన్నోవా, ఆటోలు ఢీకొనడంతో డ్రైవర్ జాఫర్ (48) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రం రాయచోటికి చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు వాహనాలను తప్పించే ప్రయత్నంలో ఆటో నుజ్జు నుజ్జు అయింది. క్షతగాత్రులను సంబేపల్లి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
KDP: సిద్దవటం మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారికి శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం పలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పరిసర ప్రాంతాల ప్రజలు స్వామివారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.
KRNL: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్‌ను రూ.3 వేలు నుంచి ఒకేసారి రూ.4 వేలకు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని టీడీపీ ఇంఛార్జి రాఘవేంద్ర అన్నారు. కౌతాళం మండలం సులేకేరి గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేశామన్నారు.
WG: కూటమి ప్రభుత్వం మధ్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడకుండా లక్షలాది గీత కార్మికులకు జీవనాధారంగా ఉన్న కల్లుగీత వృత్తిని ఆధునీకరించాలని ఏపీ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి డిమాండ్ చేశారు. శనివారం భీమవరం సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ మద్యం, కల్తీ మద్యం అమ్మే బడా వ్యాపారులపై చర్యలు తీసుకోవాలన్నారు.