• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ప్రతి వార్డులోనూ అభివృద్ధి పనులు’

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులోనూ అభివృద్ధి కార్యక్రమాలను త్వరలోనే చేపట్టనున్నట్లు కమిషనర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వార్డ్ బాట కార్యక్రమంలో భాగంగా శనివారం 13వ వార్డులో కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపడం జరిగింది పేర్కొన్నారు.

September 21, 2024 / 03:04 PM IST

భగత్ సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ 2k24 లోగో ఆవిష్కరణ

WG: ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భగత్ సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ 2K24 లోగోను శనివారం నరసాపురం డీఎస్పీ ఎల్.మురళీకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని, జీవితంలో అత్యంత కీలకమైన విద్యార్థి దశలో మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ఉండాలని సూచించారు.

September 21, 2024 / 03:04 PM IST

11వ రోజు కొనసాగిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ నిరసన

VZM: గజపతినగరం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శనివారం 11 రోజు కూడా కాంట్రాక్ట్ స్టాప్ నర్సుల నిరసన కార్యక్రమం జరిగింది. కాంట్రాక్ట్ స్టాప్ నర్సలను తక్షణమే రెగ్యులర్ చేయడంతో పాటు జీవో నెంబర్ 115 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు.

September 21, 2024 / 03:01 PM IST

ఘనంగా గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం

VSP: భీమునిపట్నం జిల్లా విద్యా శిక్షణ సంస్థలో శనివారం గురజాడ అప్పారావు 163వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. డైట్ ప్రిన్సిపాల్ ఎం.జ్యోతికుమారి మాట్లాడుతూ తెలుగుజాతికి, తెలుగు భాషకు గురజాడ అప్పారావు చేసిన సేవలు ఎనలేనివన్నారు.

September 21, 2024 / 03:01 PM IST

108 వాహనంలో ప్రసవం

CTR: పుంగనూరు మండలం ఏ. కొత్తకోటకు చెందిన గంగాభవాని పురిటి నొప్పులతో పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో చేరింది. వైద్యులు మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఇందులో భాగంగా ఆమె 108 వాహనంలో వెళుతూ… మార్గమధ్యలో భీమగానిపల్లి క్రాస్ వద్ద మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఈఎంటి నాగభూషణం, పైలట్ గోవర్ధన్ తెలిపారు.

September 21, 2024 / 03:00 PM IST

విశ్వకర్మ జయంతి సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం

శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రం సార్వకోట్ల గత ఐదు రోజులుగా పూజింపబడుతున్న శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతొత్సవాలు నిర్మహించారు. దీనిలో భాగంగా శనివారం ప్రధాన రహదారి పక్కన పూజలు అందుకుంటున్న ఆయన మండప ఆవరణలో భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు గ్రామాలనుండి వందలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్నిస్వీకరించారు.

September 21, 2024 / 02:59 PM IST

మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని రూపొందించాలి: గిరిధర్

SKLM: లావేరు మండలం అదపాక ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు శనివారం సందర్శించారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించారు. మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని ప్రభుత్వం రూపొందించాలని కోరారు. శాస్త్రీయ సమాజ నిర్మాణానికి మూఢనమ్మకాలను రూపుమాపేందుకు జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తోందన్నారు.

September 21, 2024 / 02:57 PM IST

రాబోవు ఐదేళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్

PLD: రాబోవు 5 సంవత్సరాలకు పల్నాడు జిల్లా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర @2047 విజన్ ముసాయిదాకు అనుగుణంగా జిల్లా, మండల స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు రూపకల్పన చేసే అంశాలపై దిశా నిర్దేశం చేశారు.

September 21, 2024 / 02:56 PM IST

అన్న క్యాంటీన్ ఏర్పాటుకు స్థలం పరిశీలన

KDP: పోరుమామిళ్ల పట్టణంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి ఎంపీడీవో వరప్రసాద్, మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ స్థల పరిశీలన చేశారు. కాపు బడి స్థలం అనుకూలమైన ప్రదేశంగా గుర్తించి, అన్న క్యాంటీన్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. సెక్రటరీ వెంకటసుబ్బయ్య, వీఆర్వో చెన్నకేశవ, టీడీపీ నాయకులు ఇమామ్ హుస్సేన్ పాల్గొన్నారు.

September 21, 2024 / 02:55 PM IST

ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బండారు

కోనసీమ: వంద రోజుల్లోనే ప్రజల మనసులు గెలుచుకున్న కూటమి ప్రభుత్వం వచ్చే అయిదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పోటాపోటీగా చేస్తామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శనివారం పంచాయితీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించారు. అలాగే పంచాయితీ పారిశుధ్య కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

September 21, 2024 / 02:55 PM IST

వారికి ఎలాంటి శిక్ష విధించినా తక్కువే: కంభంపాటి

PLD: పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూలను చేపనూనె, జంతు కొవ్వులతో కల్తీ చేసి కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం దుర్మార్గమని మాచర్ల ఆర్య వైశ్య యువనాయకుడు కంభంపాటి అనిల్ కుమార్ అన్నారు. ధనార్జన కోసం గత పాలకులు ఇంతటి నీచమైన పనికి దిగజారడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి పాపానికి ఒడిగట్టిన వారికి ఏ శిక్ష విధించినా తక్కువేనని ఆవేదన వ్యక్తం చేశారు.

September 21, 2024 / 02:54 PM IST

పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

సత్యసాయి: నల్లచేరువు మండలం సంజీవు పల్లి గ్రామంలో శనివారం వ్యవసాయ శాస్త్ర వేత్త రామసుబ్బయ్య, మండల వ్యవసాయ అధికారి భారతి రైతులు సాగు చేసిన టమోటా, వేరుశనగ పంటను పరిశీలించారు. పంటలకు ఆశించే చీడ, పీడల నివారణకు తగు సూచనలు అందించారు. అదే విధంగా రైతులు ఈ పంట తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు. పంట నమోదు చేయకుంటే రాయితీలు వర్తించవని తెలిపారు.

September 21, 2024 / 02:54 PM IST

గురుజాడ అప్పారావుకి ఘన నివాళి

ATP: గుంతకల్ పట్టణంలోని సిఐటియు కాలనీలో శనివారం ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీ గురుజాడ అప్పారావు 163 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గురుజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ.. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

September 21, 2024 / 02:53 PM IST

కాకినాడలో వైద్యాధికారుల ధర్నా

KKD: కాకినాడ DMHO కార్యాలయం వద్ద శనివారం వైద్యాధికారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డా.రవి కుమార్ మాట్లాడుతూ.. MBBS వైద్యాధికారులకు కొనసాగిస్తున్న కోటా ప్రకారమే పీజీ వైద్య విద్యార్థుల కోర్సుల్లో ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేశారు. కొవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన వైద్యాధికారులకు ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

September 21, 2024 / 02:53 PM IST

‘రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా’

ELR: నూజివీడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడులోని ఎం.ఆర్. అప్పారావు కాలనీలో త్రాగునీటి పైపులైన్ల నిర్మాణానికి శనివారం మంత్రి పార్థసారథి శంఖుస్థాపన చేశారు.

September 21, 2024 / 02:53 PM IST