• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రాష్ట్రం స్వర్ణ యుగం దిశగా అడుగులు వేస్తోంది: జూలకంటి

PLD: రాష్ట్రాన్ని గత పాలకులు రాతియుగంగా చేశారని కానీ నేడు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షోభ సమయంలో రాష్ట్రాన్ని స్వర్ణ యుగంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. శనివారం కారంపూడిలో నిర్వహించిన కార్యక్రమంలో ఇది మంచి ప్రభుత్వం బ్రోచర్‌ను విడుదల చేశారు.

September 21, 2024 / 04:35 PM IST

విద్యుత్ షాక్ తగిలి రైల్వే ఉద్యోగి మృతి

TPT: రైల్వే స్టేషన్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ గురై రైల్వే ఉద్యోగి శనివారం మృతి చెందాడు. రేణిగుంట రైల్వే స్టేషన్లో భరత్ అనే ఉద్యోగి విద్యుత్ తీగల మరమ్మతులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు హై టెన్షన్ తీగలు తగిలి కుప్పకూలాడు. దీంతో తోటి సిబ్బంది హుటాహుటిన రైల్వే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భరత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

September 21, 2024 / 04:35 PM IST

ఇది మంచి ప్రభుత్వంలో ఎమ్మెల్యే శిరీషా

ASR: దేవీపట్నం మండలం ఇందుకూరు స్థానిక స్త్రీ శక్తి భవనంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి పాల్గొని వంద రోజులలో కూటమి ప్రభుత్వం పింఛన్లు పెంచడం జరిగిందని, అలాగే రాబోయే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది తెలిపారు.

September 21, 2024 / 04:33 PM IST

‘చంద్రబాబు సారథ్యంలో ఆంధ్ర అవుతుంది స్వర్ణాంధ్ర’

ప్రకాశం: పొదిలి పట్టణంలో ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు శనివారం నిర్వహించారు. సమర్థవంతమైన నాయకత్వం గల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రజలకు వివరించారు.

September 21, 2024 / 04:31 PM IST

సంక్షోభంలోనూ సంక్షేమ పాలన అందిస్తున్నాం: మంత్రి

VZM: సంక్షోభంలోనూ సంక్షేమ పాలనను అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మక్కువ మండలం గోపాలపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో శనివారం ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వం 100 రోజుల్లో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అంటించి ప్రజలకు ప్రభుత్వ పాలన గురించి వివరించారు.

September 21, 2024 / 04:30 PM IST

గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది: ఎమ్మెల్యే దేవ

కోనసీమ: కూటమి ప్రభుత్వ 100 రోజుల పరిపాలన ప్రజారంజక పాలన దిశగా అడుగులు వేస్తోందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. పడమటిపాలెంలో సర్పంచ్ మాధవి అధ్యక్షతన నిర్వహించిన ప్రజావేదిక సమావేశంలో MLA మాట్లాడారు. గత ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్రం సర్వనాశనం అయ్యిందన్నారు. నియోజకవర్గంలో రోడ్లు, తాగు, సాగునీరు, విద్య, వైద్యం, తదితర రంగాలు నిర్లక్ష్యం చేశారన్నారు.

September 21, 2024 / 04:29 PM IST

హత్య కేసులో ఇరువురి అరెస్ట్

KKD: కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో ఈనెల 15వ తేదీన జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కాకినాడ త్రీ టౌన్ సీఐ కెవిఎస్ సత్యనారాయణ తెలిపారు. ఆయన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం హత్య కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ… ఈశ్వరరావు హత్య ఉదాంతాన్ని వివరించారు.

September 21, 2024 / 04:26 PM IST

సబ్‌స్టేషన్ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి

బాపట్ల: యద్దనపూడి మండల పరిధిలోని యనమదలలో నూతన సబ్ స్టేషన్ భూమి పూజ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, బాపట్ల జిల్లా కలెక్టర్ జి. వెంకట మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

September 21, 2024 / 04:23 PM IST

ఏలూరులో జేసీబీ నడిపిన మంత్రి

ఏలూరు: నూజివీడులో వరదల కారణంగా గండి పడిన పెద్దచెరువు గట్టు మరమ్మతు పనులకు శనివారం మంత్రి పార్థసారథి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నూజివీడు ప్రజలు కష్టాలు పడడంతోపాటు, పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. రూ.4 కోట్ల నిధులతో మరమ్మతు పనులు చేపట్టామన్నారు.

September 21, 2024 / 04:21 PM IST

నూజివీడు పట్టణంలో పట్టపగలే చోరీ

కృష్ణా: నూజివీడు పట్టణంలోని ఎంప్లాయిస్ కాలనీలో గల సెయింట్ మేరీస్ పాఠశాల సమీపంలో శనివారం పట్టపగలు చోరీ జరిగిన సంఘటన సంచలనంగా మారింది. ఇటుకల వ్యాపారి వల్లభనేని రామకృష్ణ ఇంటిలో ఎవరూ లేని సమయంలో అగంతకులు చోరీ చేశారు. అగంతకులు 12 కాసుల బంగారం, మూడు కేజీలు వెండి, 45 వేల రూపాయల నగదు చోరీ చేసినట్లు ప్రాథమిక సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

September 21, 2024 / 04:20 PM IST

ఎరిక్షన్ బాబుని కలిసిన త్రిపురాంతకం సీఐ

ప్రకాశం: త్రిపురాంతకం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జి హసన్ గారు యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుని యర్రగొండపాలెం టీడీపీ పార్టీ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తమ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతలు మరియు ప్రజలకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఎరిక్షన్ బాబు గారు సీఐ గారిని కోరారు.

September 21, 2024 / 04:18 PM IST

రూ.లక్ష విరాళం అందించిన బొమ్మూరు విద్యార్థులు

E.G: విజయవాడ వరద బాధితులకు రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు అక్షర శ్రీ స్కూల్ విద్యార్థులు అండగా నిలిచారు. వరద బాధితుల సహాయార్థం విద్యార్థులు రూ.లక్ష విరాళాలు సేకరించి ఆ సొమ్మును చెక్కు రూపంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి శనివారం అందజేశారు. ఈ మేరకు స్కూల్ డైరెక్టర్ నాగరత్నం, విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు.

September 21, 2024 / 04:16 PM IST

సత్యదేవుని ఆలయంలో వైభవంగా ప్రాకార సేవ

KKD: శంఖవరం మండలం అన్నవరం సత్యదేవుని ఆలయంలో ప్రతీ శనివారం నిర్వహించే ప్రాకార సేవను ఈరోజు వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల వేదమంత్రాలు, మేళతాళాల నడుమ స్వామి, అమ్మవారి ప్రాకార సేవ జరిపించారు. అనంతరం ఆలయ పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు.

September 21, 2024 / 04:15 PM IST

ఉచిత ఇసుక విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

కోనసీమ: ఉచిత ఇసుక విధానంపై అధికారులంతా పూర్తి అవగాహన కలిగి ఉండాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన శనివారం ఇసుక బుకింగ్ ఆన్‌లైన్ పోర్టల్ విధానంపై అధికారులతో సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఇసుక ర్యాంపుల నిర్వహణ ఉండాలన్నారు.

September 21, 2024 / 04:13 PM IST

కూటమి అమలు చేసిన పథకాలు వివరించిన కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ శనివారం శ్రీకాకుళం నగర్ కార్పొరేషన్‌కు చెందిన 24వ డివిజన్ మహాలక్ష్మినగర్‌లో ప్రతి ఇంటికి వెళ్లి స్థానికులతో మాట్లాడారు. వాటిని ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా ప్రజలకు అందించిన వివిధ సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. సామాజిక పెన్షన్ల రూ. 4000 చేశామని, అన్న క్యాంటీన్ల సేవలు వివరించారు.

September 21, 2024 / 04:13 PM IST