బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ షోలో ఆయన ఎవరికీ తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయడం విశేషం.
దివంగత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ క్రాష్ గురించి కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతో షోలో ఉన్నవారితో పాటు ఆడియెన్స్ కూడా అవాక్కయ్యారు.
కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా చేసిన తరువాత స్పీకర్ అయ్యానని తెలిపారు. అయితే ఆ రోజు వైయస్ఆర్తో పాటు తాను కూడా హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉందని.. కానీ అసెంబ్లీ ముగిసే సమయం కావడంతో తాను వెళ్లలేకపోయానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అలా తాను బతికున్నా కాబట్టే.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యానని ఆయన గుర్తుకు చేశారు. తన తండ్రి మరణించినప్పుడు ఎంత బాదపడ్డానో.. రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా అంతే బాదపడ్డానని చెప్పుకొచ్చారు.
తాను పుట్టిపెరిగింది హైదరాబాద్లోనే అని ప్రస్తుతం తాను ఉంటుంది కూడా ఇక్కడే అని ఆయన తెలిపారు. అయితే జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు చర్చించడం అవసరం లేదని.. ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.