janasena pawan kalyan about alliance in kondagattu
జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. తన ఏపీ యాత్ర కోసం ఉపయోగించే ఎన్నికల రథం వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. పొత్తుల విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయని చెప్పారు.
ఆయన వచ్చే ఎన్నికల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. మూడు ఆప్షన్లలో ఒక ఆప్షన్ గా బీజేపీతో ఉంటామని.. ఇప్పటికీ బీజేపీతోనే ఉన్నామన్నారు. భవిష్యత్తులోనూ ఆ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ బీజేపీ తమతో కలిసి రాకపోతే.. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తామని ఇది రెండో ఆప్షన్ అని తెలిపారు. అది కూడా కుదరకపోతే.. కొత్త పొత్తులకు తాము సిద్ధమని ఇదే తమ మూడో ఆప్షన్ అని.. ఈ మూడు ఆప్షన్లలో ఏ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటాం అనేది ఎన్నికల ముందు తెలుస్తుందని వెల్లడించారు. ఎన్నికలకు వారం ముందు ఏ పార్టీతో పొత్తు ఉంటుంది.. ఏ పార్టీతో కలిసి ముందుకు వెళ్తాం అనేదానిపై క్లారిటీ ఇస్తామని ఆయన తెలియజేశారు.