జనసేన, వైసీపీ ల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే… జనసేన నుంచి పవన్(pawan kalyan) ఒక్కరే కాగా.. వైసీపీ నుంచి మాత్రం చాలా మంది సమాధానం చెబుతున్నారు. తాజాగా.. పవన్ చెప్పుతో కొడతానంటూ చేసిన విమర్శలకు.. ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్ నాథ్(gudivada amarnath) గట్టి కౌంటర్ కౌంటర్ ఇచ్చారు.
ఫ్రస్టేషన్ ఎక్కువై పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని అన్నారు. చెప్పుతో కొడతాడా? చెప్పులు మా దగ్గర లేవా? అంటూ ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో చెప్పుతో కొట్టడం, పళ్ళు రాలగొట్టడం అంటే పవన్ కళ్యాణ్‌కు భీమవరంలో, గాజువాకలో జరగటం లాంటిదని గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గుర్తుచేశారు. మొన్న ఎన్నికల్లో 6 శాతం ఓట్లు వచ్చిన అతని దగ్గర చెప్పులు, పళ్ళు ఉంటే 50 శాతం వచ్చిన మా దగ్గర ఎన్ని ఉండాలి అంటూ ప్రశ్నించారు. మూడు పెళ్ళిళ్ళే పవన్ కళ్యాణ్ విధానమని మంత్రి అమర్ నాథ్ ఎద్దేవాచేశారు.
ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సింహం, పులి అని అనుకున్నారని..ఇవాళ పిచ్చి కుక్క అని తేలిపోయిందని అమర్ నాథ్ తెలిపారు. పీకే అంటే ప్యాకేజీ కళ్యాణ్ అని ఇప్పటికీ అంటానని, రమ్మనండి ఏం చేస్తాడో చూస్తానని సవాలు విసిరారు. ఎవరిని కొట్టేస్తావ్..వచ్చి? అని ప్రశ్నించారు. పీకే అంటే పెళ్ళిళ్ళ కళ్యాణ్, పీకే అంటే పిచ్చి కుక్క అని కూడా అమర్నాథ్ అన్నారు. మనమంతా సమాజంలో ఉన్నాం…అడవిలో లేమని మంత్రి అన్నారు.
చిరంజీవి లేకపోతే నువ్వెక్కడ ఉండేవాడివని పవన్ కళ్యాణ్‌ను మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ టీడీపీకి ఊడిగం చేస్తున్నాడని అమర్నాథ్ విమర్శించారు. వంగవీటి రంగా మరణానికి కారణం అయిన టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకున్నావ్ అని మంత్రి ప్రశ్నించారు.
ఒకసారి యుద్ధంలో ప్రజలు ఏం సమాధానం ఇచ్చారో చూశామని, మళ్ళీ యుద్ధానికి రమ్మనండని సవాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ ఇంటి అడ్రస్ ఎక్కడో చెప్పమనండి అంటూ మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రం గురించి అవసరం లేదు…వాళ్ళ పార్టీకి చెందిన ఒక 70 పేర్లు చెప్పమనండి చాలు…. పవన్ కళ్యాణ్ ఏం చేయమంటే అది చేస్తానని సవాలు విసిరారు.పవన్ కళ్యాణ్‌కు ఆడ పిల్లలను గౌరవించే సంస్కారం లేదని మంత్రి తేల్చిపారేశారు. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న నీకు మూడు వేల స్టెఫినీలు ఉన్నారా? అని ప్రశ్నించారు.