VZM: జిల్లాలో జలధార-నీటి భద్రత కింద చేపడుతున్న పనుల ద్వారా భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఆదేశించారు. ఇవాళ వర్చువల్గా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 8010 చెరువులకు పనులు గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.