PLD: నకరికల్లులో గ్యాస్ వినియోగదారులు సోమవారం రోడ్డెక్కారు. ఆన్ లైన్ బుకింగ్‌లో సర్వర్ సమస్యల వల్ల సిలిండర్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ… ఖాళీ సిలిండర్లతో ధర్నా నిర్వహించారు. ఈ నిరసనతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తక్షణమే సాంకేతిక సమస్యలను పరిష్కరించి, గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.