NTR: నందిగామ కాకాని నగర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం ఈ నెల 30వ తారీకుతో ఈకేవైసీ గడువు పూర్తవుతుందని ప్రజలకు ప్రభుత్వం నుంచి ఏదైనా సంక్షేమ ఫలాలు రావాలంటే తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డుకు ఈకేవైసీ పూర్తిచేసుకుని ఉండాలన్నారు.