ATP: నార్పల మండలం గంగనపల్లి గ్రామంలో ఎమ్మెల్యే బండారు శ్రావణీ శ్రీ పర్యటించారు. అకాల వర్షానికి దెబ్బతిన్న ఉద్యాన పంటలను ఎమ్మెల్యే నేరుగా వెళ్లి పరిశీలించారు. చేతికొచ్చిన అరటి పంటలు అకాల వర్షానికి నేలమట్టం కావడం బాధాకరంగా ఉందని రైతులు ఎమ్మెల్యేకి విన్నవించారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.