కోనసీమ : LPG గ్యాస్ వినియోగదారులే లక్ష్యంగా కొత్త తరహా సైబర్ మోసాలు సాగుతున్నాయని డీఎస్పీ ప్రసాద్ హెచ్చరించారు. ‘GAS BILL UPDATE APK’ వంటి హానికరమైన ఫైళ్లను వాట్సాప్ ద్వారా పంపి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారని తెలిపారు. ఇటువంటి అనుమానాస్పద అప్లికేషన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇన్స్టాల్ చేయవద్దని సూచించారు.