KDP: మహిళలు, బాలికల రక్షణకు ఆపద సమయంలో ‘శక్తి యాప్’ ఎంతో కీలకంగా మారుతుందని జిల్లా రిమ్స్ ఎస్సై సుభాశ్ చంద్రబోస్ పేర్కొన్నారు. ఇవాళ జిల్లాలోని శిల్పారామంలో సందర్శకులకు ఈ యాప్ ఆవశ్యకతపై ఆయన అవగాహన కల్పించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ఈ యాప్ ద్వారా లభించే సేవలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి వివరించారు.