ATP: ప్రధాని నరేంద్ర మోదీ దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా సేవలందించి చారిత్రాత్మక రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రి, ప్రధానిగా కలిపి 8,931 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మోదీ దార్శనిక నాయకత్వం కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.