కామారెడ్డి జిల్లాలోని భిక్కనూర్ మండల కేంద్రంలోని సిద్ధిరామేశ్వర స్వామి దేవాలయంలో రేపు హుండీలను లెక్కించనున్నట్లు దేవస్థానం ఈఓ శ్రీధర్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయానికి వచ్చిన హుండీ ఆదాయాన్ని అధికారుల సమక్షంలో లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.