KRNL: మంత్రాలయం మండలం బూదూరు గ్రామంలో బుధవారం దళిత యువకులపై దాడి జరిగింది. గ్రామానికి చెందిన చాకలి నరేశ్ కత్తితో విజయ్, చిన్నలను గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇవాళ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది.