బాపట్ల: రైతులకు అన్ని రకాలుగా మేలు చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కలెక్టర్ వెంకట మురళి అన్నారు. రైతుల రిజిస్ట్రేషన్, యూరియా అమ్మకాలు, ఈ పంట, ఈ కేవైసీ, లోన్ల మంజూరుపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమంపై మండల వారీగా వివరాల గురించి ఆరా తీశారు.