AKP: నర్సీపట్నం క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు శనివారం నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్కు మూడు స్టీల్ సీటర్ సోఫాలు, ఐదు బారికేడ్లు వితరణ చేశారు. వీటిని రూరల్ సీఐ రేవతమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ రేవతమ్మ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగపడే బారికేడ్లు అందజేయడం హర్షణీయమని పేర్కొన్నారు.