నెల్లూరు: వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద శనివారం జరిపిన వాహన తనిఖీల్లో భారీగా వెండి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వెండి దాదాపు 40 కిలోలు ఉండగా.. దాని విలువ సుమారు రూ. 40 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు.