ప్రకాశం: కంభంలోని 132/33 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో మరమత్తుల కారణంగా ఆదివారం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు బేస్తవారిపేట మండలం, అర్థవీడు మండలం, కంభం మండలంలోని అన్ని గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ ఏ.ఈ శనివారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. కావున ఈ విద్యుత్ అంతరాయానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.