PPM:ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, పార్వతీపురం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పేర్కొన్నారు.శనివారం టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యల అర్జీలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు.