నెల్లూరు: రైతుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో రైతు సంఘ నేతలు ‘చలో నెల్లూరు’ కార్యక్రమం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇందుకూరుపేట నుంచి నెల్లూరు సీఐటీయూ కార్యాలయం వరకు పాదయాత్ర కొనసాగింది. సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేశ్, జిల్లా కమిటీ సభ్యులు టీవీ ప్రసాద్, రైతు సంఘం నేతలు మూల వెంకయ్య పాల్గొన్నారు. ధాన్యానికి మద్దత ధర కేటాయించాలని డిమాండ్ చేశారు.