CTR: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పని తీరు మెరుగుపడాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. చిత్తూరు జిల్లా సచివాలయంలో సహకార అభివృద్ధి కమిటీ సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. అర్హులైన వారికి పారదర్శకంగా రుణాలు మంజూరు చేసేందుకు దృష్టి సారించాలన్నారు. సహకార కేంద్ర బ్యాంక్ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు.