ATP: పి-4 మోడల్ సర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు ఆదేశించారు. శనివారం అనంతపురంలోని వెంకటేశ్వర నగర్లో పి-4 మోడల్ సర్వేను క్షేత్రస్థాయిలో వెళ్లి కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మోడల్ సర్వేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు.