TG: SLBC టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు చర్యలు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సహాయక చర్యల్లో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.