TG: రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజీ అంజనీకుమార్, టీజీ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఇద్దరిని ఆదేశించింది. మరోవైపు, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి రిలీవ్‌పై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది.