NLR: మనుబోలు మండలం పవర్ గ్రిడ్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ముందు వెళుతున్న ఆటోను వెనుక వైపు నుంచి కారు ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి బయటకు ఎగిరిపడి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.