ATP: అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ MRPS, అన్ని అనుబంధ సంఘాల అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మందకృష్ణను శాలువాతో సన్మానించారు. ఇటీవల పద్మశ్రీ పురస్కారం ఆయనను వరించడంతో అభినందనలు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం మాదిగలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.