KRNL: నాటుసారా, కర్ణాటక మద్యం రవాణాలో పట్టుబడ్డ వాహనాలపై ఆదోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు వేలం గురువారం నిర్వహించారు. స్టేషన్ పరిధిలో 23 బైకులకు ఆర్టీవో నిర్ణయించిన రూ.72 వేల ధరకు బదులుగా వేలంలో రూ.1.15 లక్షలు లభించాయి. దీనికి జీఎస్టీ రూ.20,790 కలిపి మొత్తం రూ.1,36,290 ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు సీఐ సైదులు తెలిపారు.