ELR: ప్రతి పోలీస్ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని తయారు చేసి, సమానత్వం, న్యాయం, విద్యకు హక్కు కోసం ఎంతో కృషి చేశారు అన్నారు.