సత్యసాయి: ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి సవిత తెలిపారు. ఈ సందర్భంగా అమరావతిలో మంత్రి మాట్లాడుతూ.. డీఎస్సీకి సిద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందజేయనున్నామన్నారు. ఇందుకోసం ప్రణాళికలు సైతం సిద్ధం చేశామన్నారు. అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉచిత శిక్షణ అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.