PLD: రొంపిచర్ల మండలం వి.రెడ్డిపాలెం ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రిన్సిపాల్ డా.రవినాయక్ ప్రకటన చేశారు. 5వ తరగతి చదువుతున్న వారు దీనికి అర్హులు. ఫీజు ఓసీ, బీసీలకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.125. దరఖాస్తుకు ఈ నెల 31 ఆఖరు తేదీ. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష ఉంటుంది.