GNTR: తెనాలికి చెందిన విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి జ్ఞాపకార్థం,ఆమె భర్త మొవ్వ సత్యనారాయణ పాఠశాలకు తరగతి గదులు నిర్మించారు. సుదీర్ఘ కాలం పనిచేసిన బాలికల హైస్కూల్లో విద్యార్థినుల సౌకర్యార్థం ఈ గదులను నిర్మించారు. అంతేకాకుండా,లక్షలాది రూపాయలతో మహాప్రస్థానంలో అభివృద్ధి పనులు కూడా చేయించారు. ఈ విధంగా ఆయన తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు.