SS: కదిరిలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవ 16 రోజుల పండుగలో భాగంగా స్నపన తిరుమంజన సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. వసంతోత్సవం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుల స్వామి వార్లకు రంగ మండపంలో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేష అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.