NLR: సైదాపురం మండలం సొసైటీ కేంద్రం నందు వెంకటగిరి ఎమ్మెల్యే కురగొండ్ల రామకృష్ణ సోమవారం రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం అమ్మిన 24 గంటల లోపే రైతుల అకౌంట్లలో నిధులు జమచేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.