TPT: పిచ్చాటూరు ఆరణియార్ ప్రాజెక్టులో శుక్రవారం మధ్యాహ్నం ఓ వృద్ధురాలి మృతదేహాన్ని స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. రెప్పాల పట్టు సమీపంలో ప్రాజెక్టులో తేలియాడుతున్న శవాన్ని బోటు ద్వారా వెలికి తెచ్చారు. మృతురాలు నారాయణవనం (M) నైనారుకండ్రిగకు చెందిన లేట్ సుబ్రహ్మణ్యం భార్య లైలమ్మ (70)గా గుర్తించారు.