VZM: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకుందని JC సేధు మాధవన్ సోమవారం తెలిపారు. జిల్లాలోని రైతు సేవా కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈనెల 28 వరకు మాత్రమే పనిచేస్తాయని వెల్లడించారు. జిల్లాలోని 367 రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 4.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.