PLD: మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సతీమణి శోభారాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం జరిగిన ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్ కొమెర అనంతరాములు ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.