కోనసీమ: జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజలకు తన సందేశం అందించారు. దేశ సమైక్యత, సమగ్రత, శాంతి భద్రతలకు ఉగ్రవాదం అతిపెద్ద ముప్పుగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదం మానవత్వానికి విరుద్ధమైందని, అది దేశ అభివృద్ధిని అడ్డుకునే ప్రమాదకర శక్తి అని అన్నారు. ప్రతి పౌరుడు దేశభక్తితో ముందుకు సాగాలన్నారు.