W.G: గ్రామాల్లో రీ- సర్వే ప్రక్రియను మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని తాడేపల్లిగూడెం ఎంపీడీవో ఎం.విశ్వనాథ్ సూచించారు. సోమవారం తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో రీ-సర్వేపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో తాడేపల్లిగూడెం మండలం ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు.