Election commission notices to Janasena chief Pawan Kalyan
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నాయకుడు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అందుకు 48 గంటల్లో పూర్తి వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. స్కామ్ స్టార్, భూకబ్జాకోర్, ఇసుకు అక్రమార్కుడు, మద్యం సామ్రాజ్యానికి అధినేత అంటూ పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కిన్నారు. ఏప్రిల్ 8న ఫిర్యాదు చేయగా ఇవాళ పవన్‌కు నోటీసులు జారీ చేసింది. మల్లాది విష్ణు ఫిర్యాదును పరిశీలించిన అనంతరం 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్‌ను ఈసీ కోరింది. ఇటీవల అనకాపల్లిలో నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్ జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. పిఠాపురం నుంచి జనసేన తరుఫున ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీచేస్తున్న విషయం తెలిసిందే.