KRNL: అనారోగ్యంతో ఇవాళ మృతి చెందిన రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ తండ్రి కురువ బజారి మృతదేహాన్ని ఎంపీ బస్తిపాటి నాగరాజు సందర్శించారు. గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామంలో బజారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ, మృతికి గల అనారోగ్య కారణాలను అడిగి తెలుసుకున్నారు.