KRNL: రాష్ట్ర విభజన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కర్నూలు వెనుకబడినా, ఏ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్ దేశాయ్ విమర్శించారు. 2014లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కాలేదని, రాష్ట్రంలోని తొలి మున్సిపాలిటీ ఆదోనిలో పరిశ్రమలు మూతపడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.