ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా పోలీసులు కార్డన్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 41 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకొని కొందరు వాహన యజమానులకు చలానాలు విధించారు. అలాగే గంజాయి, మాదకద్రవ్యాలపై సోదాలు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.