గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పిడుగురాళ్లలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మెడికల్ కళాశాలలో మొత్తం 211 పోస్టులను భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. జనరల్ డ్యూటీ అటెండెంట్‌తో పాటు తదితర పోస్టులు ఉన్నాయని తెలిపింది. అభ్యర్థులు ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించింది.