ELR: పెదవేగి మండలం న్యాయంపల్లిలో పేకాట శిబిరంపై పెదవేగి సీఐ సీహెచ్. రాజశేఖర్ శుక్రవారం దాడి చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.9,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పేకాటరాయుళ్లుపై నిరంతరం నిఘా పెడతామని సీఐ హెచ్చరించారు.