కందుకూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుపై దాడికి పాల్పడిన నలుగురు హిజ్రాలను బుధవారం అరెస్ట్ చేసినట్లు CI అన్వర్ భాషా తెలిపారు. మంగళవారం కోవూరు రోడ్డులోని హాస్పిటల్లో డాక్టర్ లేనప్పుడు దసరా మామూళ్ల కోసం నర్సుతో గొడవ పడిన హిజ్రాలు ఆమెను దారుణంగా చంపుతామని బెదిరించారని అన్నారు. అక్కడి CC కెమెరాలలో ఘటన మొత్తం రికార్డ్ అయిందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని CI వెల్లడించారు.