KRNL: అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రభుత్వ పథకాల పేరుతో నకిలీ కాల్స్ ఎత్తి, వారిని నమ్మి, లింక్స్ క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దని హెచ్చరించారు. అనుమానం వస్తే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు.