BPT: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో బాపట్ల జిల్లాలో ఎండలు పెరుగుతున్నాయని, తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. చేతిపంపులు, బోర్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని, ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా తగిన వనరులను సమకూర్చుకోవాలని శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన సూచించారు.