PPM: పార్వతీపురం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ డాక్టరు ఎన్. ప్రభాకరరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పట్టణ అభివృద్ధిపై కీలక దిశ నిర్దేశం చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ ప్రాథమిక లక్ష్యం అన్నారు.