GNTR: కాకుమాను మండలం కొండపాటూరు ప్రీ హైస్కూల్‌ను జిల్లా పరిషత్ హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేయాలని కలెక్టర్ నాగలక్ష్మీకి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం 8వ తరగతి వరకు పాఠశాలలో బోధన జరుగుతుందన్నారు. 10వ తరగతి వరకు అప్ గ్రేడ్ చేస్తే విద్యార్థులు ఇదే పాఠశాలలో చదువుకునే వీలు అవుతుందని పేర్కొన్నారు.